ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aamir Khan's third marriage to Gauri Spratt drew criticism

ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చెల్లదు

Aamir Khan's third marriage to Gauri Spratt drew criticism


బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మూడు పెళ్లిళ్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన రీనా దత్తాను ను వివాహం చేసుకుని ఆమెకు విడాకులిచ్చాక కిరణ్ రావు ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆతర్వాత ఆమెకు ఓ బిడ్డ పుట్టాక ఆమిర్ ఖాన్ కిరణ్ రావుకు కూడా విడాకులిచ్చి తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ని పెళ్లి చేసుకున్నారు. మూడు పెళ్లి ఆయన వ్యక్తిగతమే అయినా..

ఆమిర్ ఖాన్ లవ్ జీహాదికి పాల్పడ్డారని, హిందూ మహిళలను ముస్లిం అయిన ఆమిర్ ఖాన్ వివాహం చేసుకుని వదిలేయడం హాబీగా చేసుకున్నారు, ఇది ల‌వ్ జిహాదే అని ఆయ‌న మీద సోషల్ మీడియాలోనే కాదు మ‌హారాష్ట్ర బీజేపీ మంత్రి నితీశ్ రాణే కూడా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆ విషయమై ఆమిర్ ఖాన్ రియాక్ట్ అవుతూ తాను వివాహాలు చేసుకోవడం లవ్ జీహాదీ కాదని, తను పెళ్లాడిన వారిలో ఎవరూ ఇస్లాం మ‌తంలోకి మార‌లేద‌ని, రీనా, కిర‌ణ్ ఇద్ద‌రూ పెళ్లి త‌ర్వాత కూడా హిందూ మ‌తంలోనే కొన‌సాగార‌ని చెప్పిన ఆమిర్ ఖాన్ తన మూడో భార్య గౌరీ స్ప్రాట్ అస‌లు హిందువే కాద‌ని, క్రిస్టియ‌న్ అని ఆమిర్ స్పష్టం చేసారు.

గౌరీ అసలు మ‌తాచారాల‌ను పాటించ‌ద‌ని చెప్పడంతో ముస్లిం మత పెద్దలు ఆమిర్ మూడో పెళ్లిపై మరో బాంబ్ పేల్చారు. గౌరీ ఇస్లాం మ‌తంలోకి మార‌లేదు కాబ‌ట్టి ఆమిర్ ఖాన్ చేసుకున్న మూడో పెళ్లి చెల్ల‌దంటూ ముస్లిం పెద్ద‌లు ఫ‌త్వా జారీ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ విషయమై ఆమిర్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Aamir Khan Breaks Silence on Criticism Over His Third Marriage