జన నాయగన్ ను లైట్ తీసుకుంటారా

Jana Nayagan Release date out


తమిళనాడు సీఎం విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ముందుగా జులై 24 అన్నప్పటికీ ఒకరోజు ముందుగానే అంటే జులై 23 నే జన నాయగన్ విడుదల అంటూ మేకర్స్ తాజాగా ప్రకటించారు. మరి ఆరు నెలలుగా జన నాయగన్ కోసం విజయ్ అభిమానులు వెయిట్ చేసారు.

అయితే జన నాయగన్ ఆగి ఆగి జూన్ 23 కి విడుదల కావడంతో ఆ రోజు విడులవుతున్న ఇతర భాషల సినిమాల పరిస్థితి ఏమిటి. తెలుగులో అయితే  కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ విడుదల కాబోతుంది. వాళ్ళు జన నాయగన్ వచ్చినా మాకు ప్రోబ్లేం లేదు, మా చెన్నై లవ్ స్టోరీ 24 నే విడుదల అని చెప్పేసారు.

ఇక కాజల్ అగర్వాల్ ఇండియన్ లవ్ స్టోరీ కూడా జులై 24 నే విడుదల కాబోతుంది. మరి జన నాయగన్ ను లైట్ తీసుకుంటున్నారా.. తెలుగులో జన నాయగన్ ప్రభావం ఏమి ఉండదు అనుకుంటున్నారా, ఎందుకంటే భగవంత్ కేసరికి జన నాయగన్ రీమేక్ అంటున్నారు. అందుకే తెలుగులో జన నాయగన్ విడుదలైనా తమ సినిమాలకు ఎలాంటి నష్టం ఉండదని భావిస్తున్నారేమో చూడాలి.

Jana Nayagan Movie