నైట్ షూట్ మోడ్ లో డ్రాగన్
NTR braces for Dragon night shoot
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ డ్రాగన్ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో డ్రాగన్ నైట్ షూట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షూట్ లో ఎన్టీఆర్ ఇంకా హీరోయిన్ రుక్మిణి వసంత్, అలాగే కీలక నటులు పాల్గొంటున్నారు.
ఈ నైట్ షూట్ లో చిత్రీకరించే సన్నివేశాలు డ్రాగన్ చిత్రంలో కీలక సన్నివేశాలుగా నిలుస్తాయని చెబుతున్నారు. డ్రాగన్ కి సంబందించిన మేజర్ పార్ట్ షూట్ రామోజీ ఫిలిం సిటీలోనే వేసిన స్పెషల్ సెట్స్ లో పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఇక ఈ చిత్రం నుంచి మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ తప్పుకున్నాక ఆ ప్లేస్ లోకి ఏ హీరో వస్తాడో అనే క్యూరియాసిటిలో ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.
క్రేజీ యాక్షన్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో విడుదల చెయ్యనున్నట్లుగా మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు.







































