ఐరెన్ లెగ్ ముద్ర వదిలించుకున్న హీరోయిన్
Actress Bhagyashri Borse
హీరోయిన్స్ కి వరసగా సినిమాలు ప్లాప్ లు పడితే వారిపై ఐరెన్ లెగ్ ముద్ర వెయ్యడం పరిపాటిగా మారిపోయింది. వాళ్ళు ఎంతగా గింజుకున్నా ఆ ట్యాగ్ ని చెరుపుకోవడం కష్తమైపోతుంది. అది పోవాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. మీడియా ముందు ఎంతగా చెప్పుకున్నా వారిని ఎవరూ పట్టించుకోరు. పూజ హెగ్డే వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఒక్కసారి ప్లాప్ పడింది, ఆతర్వాత అన్ని నిరాశపరిచే సినిమాలు ఇవ్వగానే ఆమెపై కూడా ఐరెన్ లెగ్ ముద్ర పడింది.
ఇక బేబమ్మ కృతి శెట్టి పరిస్థితి అదే. మమ్మల్ని ఐరెన్ లెగ్ ముద్ర వేసి ట్రోల్ చేస్తారు. అందులో హీరో ఉంటారు. వారిని ఏమి అనరు, కానీ హీరోయిన్ నే తప్పుపడతారంటూ మాట్లాడింది. కానీ ఎవరూ పట్టించులేదు. ఇక శ్రీలీల ది ఆల్మోస్ట్ అదే పరిస్థితి. ఇప్పటివరకు మూడు సినిమాల్తో నిరాశపరిచిన భాగ్యశ్రీ బోర్సే ని అదే అన్నారు.
భాగ్యశ్రీ బోర్సే ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకుంది. కానీ లెనిన్ రిజల్ట్ ట్ దానిని భాగ్యశ్రీ బోర్సే వదిలించుకున్నట్టే కనిపిస్తుంది. లెనిన్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కి బాగా పేరు రాకపోయినా లెనిన్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి అమ్మడు బాగా ఎమోషనల్ అవుతుంది.
భారతి పాత్రలో అందంగా ఉంది, కానీ ఆమె పాత్రలో ఎక్కువ బలం లేకపోవడం మైనస్. అయినప్పటికీ లెనిన్ కి పాజిటివ్ టాక్ రావడం, మంచి కలెక్షన్స్ రావడంతో లేని హిట్ భాగ్యశ్రీ ఖాతాలోకి చేరిపోయింది. దానితో ఈ భామ ఐరెన్ లెగ్ ముద్ర ఆల్మోస్ట్ వదిలించుకున్నట్టే.







































