రాకా ఈసారి పులి స్టోరీ

Raakaa update


ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ పులి తో ఫైట్ ఎంతగా హైలెట్ అయ్యింది అందరికి తెలిసిన విషయమే అందుకే ఈసారి అల్లు అర్జున్ కూడా పులి తో కలిసి కనిపిస్తాడట. రాకా చిత్రంలో అల్లు అర్జున్ డబుల్ కాదు ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్లుగా అల్లు అర్జున్ రెస్ట్ లేకుండా రాకా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

అయితే రాకా లో ఫారెస్ట్ ఎపిసోడ్లు అత్యంత కీలకంగా ఉంటాయని, దానికోసం రకరకాల అడవి జంతువులను పూర్తిగా వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌కే పరిమితం కాకుండా, కథలో భాగంగా కనిపించేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

మెయిన్ గా పులి పాత్ర రాకా లో మెయిన్ హైలెట్ గా నిలవబోతుంది అని, మెయిన్ ట్విస్ట్ లకు ఆ పులి పాత్రే కారణమవుతుందని సమాచారం. ప్రస్తుతం ఆ సన్నివేశాల కోసం వీఎఫ్‌ఎక్స్ టీమ్ ప్రత్యేకంగా పనిచేస్తోంది.. ఈ సీన్స్ అన్ని రాకా లో మెయిన్ హైలెట్ గా నిలవబోతున్నాయని సమాచారం. 
 

Raakaa