ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kalki Sequel: Nag Ashwin powerful take

కల్కి : నాగ్ అశ్విన్ కి కోపమొచ్చింది

Kalki Sequel: Nag Ashwin powerful take


ఈమధ్యన సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక ఏ చిన్న విషయమైనా భూతద్దం పెట్టి వెతకడమే కాకుండా, ప్రతి చిన్న విషయాన్ని ట్రోలింగ్ చెయ్యడం చూస్తున్నాం. ఇప్పుడు లెనిన్ సినిమా విడుదలయ్యాక కర్ణుడిని ఇలా చూపించాలి కానీ కల్కి లో కర్ణుడిని ఎక్కువగా చూపించారంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఇలాంటి పోస్ట్ లపై చిర్రెక్కిపోయి ఉన్న కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా.. ద్రోణ వధ పర్వంలో కర్ణుడి గొప్పతనం గురించి అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. దయచేసి మీరు ఒకసారి మహాభారతం చదవండి. అందుకే వివేక్ దేబ్రాయ్ అనువాదాన్ని చదవమని నేను మీకు సలహా ఇస్తున్నాను.

మన చరిత్ర, పురాణాలపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కృష్ణుడు అర్జునుడి దగ్గర కర్ణుడిని ఎన్నిసార్లు పొగిడాడో గూగుల్ లో వెతకండి. దయచేసి కల్కి పార్ట్ చూసే వరకు వెయిట్ చెయ్యండి.. అంటూ నాగ్ అశ్విన్ కల్కి 2 లోని కర్ణుడి పాత్రపై చెబుతూ కాస్త కోపంగానే పోస్ట్ చెప్పారు. 

Kalki sequel: Nag Ashwin powerful take to fans take on Karna