విమర్శకులూ, మేకర్స్ ఇది విన్నారా..


సోషల్ మీడియాలో కొంతమంది జర్నలిస్ట్ లను ఉద్దేశించి సామాన్య ప్రేక్షకులు మాట్లాడుతున్న మాటలు, పెడుతున్న పోస్ట్ లు చూస్తే. నిజమే అనిపించకమానదు. కొన్ని సినిమాలకు సినీ  విమర్శకులు ఇచ్చే రివ్యూస్, రేటింగ్స్ తిరగబడడం చూస్తున్నాం. ఓ సినిమా హిట్ అంటూ రేటింగ్స్ వేస్తె.. అది ప్రేక్షకులకు అస్సలు నచ్చట్లేదు.

మరికొన్ని సినిమాలకు సినీ విమర్శకులు ఇచ్చే రేటింగ్స్ తక్కువే అయినా సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. హిట్టు చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన లెనిన్ చిత్రం బావుంది అంటూ సినీ విమర్శకులు మెచ్చుకున్నారు. యావరేజ్ రేటింగ్స్ ఇచ్చినా సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ ట్వీట్లు  వేస్తున్నారు.

అది చూసిన ఓ సామాన్య ప్రేక్షకుడు లెనిన్ చిత్రం చూసి తన రివ్యూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. సినిమా ఇండస్ట్రీ, ఇంకా సినీ విమర్శకులు లెనిన్ ని పొగుడుతున్నారు కానీ.. సినిమా చూస్తే బోర్ కొడుతోంది. అఖిల్ యాక్టింగ్ సూపర్, అఖిల్ లుక్ సూపర్ అంటున్నారు కానీ అందులో కొత్తేముంది.

నిజాయితీ గల విమర్శ: సినిమా బాలేనప్పుడు బాలేదని చెబితేనే, మేకర్స్ తదుపరిసారి మంచి కథలపై శ్రద్ధ పెడతారు. లేదంటే ఇలాంటి బలహీనమైన కథలతోనే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృధా చేస్తూ ఉంటారు.
కాబట్టి, ప్రేక్షకుల పల్స్ ప్రకారం మరియు స్క్రిప్ట్ లోని భారీ లోపాల దృష్ట్యా లెనిన్ ఒక విఫలప్రయత్నం అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజాయితీ గల విమర్శను కోరుకున్నప్పుడే పరిశ్రమలో మార్పు సాధ్యమవుతుంది..

ఇది నిజమే. దర్శకుల్లోని లోపాలను ఎత్తి చూపితేనే కదా తన తదుపరి సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, నిర్మాతలు జాగ్రత్తపడతారు. మంచి సినిమాలు తియ్యగలుగుతారు. ఇదేదో కాస్త ఆలోచించండి.