కాలం కలిసొస్తే కొందరికి ఇండస్ట్రీలో అలా!
Madhavan's journey is a remarkable example of passionనటుడు ఆర్. మాధవన్ సినీ రంగ ప్రవేశం చాలా ఆసక్తికరంగా సాగింది. మాధవన్ కెరీర్ ప్రారంభంలో ముంబైలో కమ్యూనికేషన్ స్కిల్స్ ..పబ్లిక్ స్పీకింగ్ శిక్షకుడిగా పనిచేశారు. ఆ రోజుల్లోనే నెలకు 70 వేల నుంచి 80 వేల రూపాయల వరకు సంపాదించేవారు. ఒకానొక సమయంలో ఎవరైనా వచ్చి నటిస్తారా? అని అడిగితే మొదట అదేదో? మోసం అని మాధవన్ భావించారట. తనకు పిలిచి ఎవరు అవకాశం ఇస్తారు అనుకున్నారు. కానీ కాలం కలిసొస్తే? అన్నీ వాటంతటే జరిగిపోతాయి అన్నట్లు మాధవన్ జీవితం సంతోషంగా ముందుకు సాగిపోతుంది. వివరాల్లోకి వెళ్తే...
మాధవన్ కు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా? కలలను నిజం చేసుకోవాలనే పట్టుదల మ్యాడీని అగ్ర నటుడిగా నిలబెట్టింది. పదో తరగతిలో ఉన్నప్పుడే తాను ధనవంతుడిగా, ప్రసిద్ధ నటుడిగా మారాలని లక్ష్యాన్ని రాసుకున్నా నని గుర్తు చేసుకున్నారు. అసాధ్యమనిపించే కలలను కనడం మానేయకూడదని అవి ఒకరోజు నిజమవుతాయని మాధవన్ ఆ రోజే నమ్మారుట. జంషెడ్‌పూర్ నుండి వచ్చి అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ నటులతో కలిసి నటించడం, ఆయన నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని మ్యాడీ పేర్కొన్నారు.
అనుకోకుండా వచ్చిన అవకాశంతో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `అలైపాయుతే` చిత్రంలో అవకాశం రావడం, ఆ చిత్రం ఘనవిజయం సాధించడం మాధవన్ జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత మాధవన్ దక్షిణాది నుంచి హిందీ పరిశ్రమ వరకు తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తనను తాను మలుచుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటూ అగ్ర నటుడిగా ఎదిగిన తీరు నేటి తరం నటులకు ఎంతో స్ఫూర్తిదాయకం.







































