అఖిల్ లెనిన్ తో సిక్స్ కొట్టాడు
Lenin first weekend collections
అవును క్రికెట్ భాషల్లో చెప్పాలి అంటే అఖిల్ లెనిన్ చిత్రంతో సిక్స్ కొట్టేశాడు. అఖిల్ కి క్రికెట్ అంటే ఎంతిష్టమో అందరికి తెలుసు. అఖిల్ క్రికెట్ చాలా బాగా ఆడతాడు. క్రికెట్ లో అఖిల్ ఎన్నిసార్లు సిక్స్ కొట్టాడో తెలియదు కానీ.. ఇప్పుడు సినిమాల్లో లెనిన్ చిత్రంతో అఖిల్ మొదటసారి సిక్స్ కొట్టాడు.
లెనిన్ చిత్రం కేవలం మూడు రోజుల్లో రూ.61.1 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. లెనిన్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైల్డ్ కలెక్షన్స్ ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అది చూసిన అక్కినేని అభిమానులు మనోడు కొట్టేసాడంటూ పండగ చేసుకుంటున్నారు. అఖిల్ తన కెరీర్ లో లెనిన్ తో మొదటి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు.
ఇక ఈ రోజు సోమవారం లెనిన్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అనేది అందరిలో కనిపిస్తున్న ఆసక్తి. మరోపక్క లెనిన్ చిత్రం చాలా ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటినుంచి లెనిన్ కలెక్ట్ చేసే కలెక్షన్స్ అన్ని లాభాలే మరి.







































