మోక్షు కన్నా అక్కే హైలెట్ అవుతోంది
Balayya Daughter Tejaswini Dance Video Viral
నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావాల్సిన మోక్షజ్ఞ విషయం ఇంకా తేలడం లేదు, మోక్షజ్ఞ చాలా తక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తాడు. ఎలాంటి హడవిడి ఉండదు. హీరో కావాల్సిన వాడు సోషల్ మీడియాలో, అభిమానుల నడుమ కనిపిస్తే ఆ మజానే వేరు.
మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని అభిమానులు వెయిటింగ్. కానీ ఆ ముహూర్తం రావడం లేదు సరికదా మోక్షు జాడ కూడా తెలియడమే లేదు. కానీ ఈలోపే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. తన తండ్రి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన వెన్నంటే ఉంటున్న తేజస్విని మరో రకంగా ఫేమస్ అవుతుంది.
అంతేకాదు సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ తేజస్విని తనలోని మరో కోణాన్ని పరిచయం చేస్తుంది. ఓ జ్యువెలరీ యాడ్ లో మెరిసిన తేజస్విని ఏమైనా సినిమా ల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనుకునేలా ఆమె డాన్స్ కనిపిస్తుంది. ఆ మద్యన ఓ హిట్ సాంగ్ కి డాన్స్ చేసి షాకిచ్చిన తేజస్విని మరోమారు సాయి పల్లవి లవ్ స్టోరీ సారంగ దారియా సాంగ్ కి డాన్స్ చేసి మతిపోగొట్టేసింది.
నెమలి నాట్యమాడేనా అన్నట్టుగా తేజస్విని ఆ సాంగ్ కి వేసిన డాన్స్ స్టెప్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడుతున్నారు. మరి హీరో అవ్వాల్సిన మోక్షు కన్నా అక్క తేజస్విని నే తెగ హైలెట్ అవుతుందిగా అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.







































