రూ.100 కోట్ల సినిమా ఓటీటీలోకి
Maa Inti Bangaaram OTT Streaming Date
రూ.100 కోట్ల సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. అది కూడా నెల లోపే. ఆ సినిమా ఏదో కాదు సమంత మా ఇంటి బంగారం. జూన్ 19 న విడుదలైన మా ఇంటి బంగారం చిత్రానికి మహిళలు బ్రహ్మరథం పట్టారు. అది ఏ రేంజ్ లో అంటే రూ.100 కోట్లు కొల్లగొట్టేంత ప్రేమ చూపించారు.
నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు అందించిన కథతో సమంత మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్రానికి రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం రేర్ ఫీట్ అనే చెప్పాలి. థియేటర్స్ లో హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
ఈ నెల 17 నుంచి జియో ప్లస్ హాట్ స్టార్ లో మా ఇంటి బంగారం చిత్రం స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మా ఇంటి బంగారం చిత్రానికి జియో హాట్ స్టార్ ఫ్యాన్సీ డీల్ తో డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు నాలుగు వారాల్లోనే ఈ చిత్రం హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది.







































