వృశకర్మ ఉత్సాహంలో చైతు అదే ఫార్మెట్ లో!
Hero Naga Chaitanya - Vrushakarmaయువ సామ్రాట్ నాగచైతన్య `తండేల్` విజయం తర్వాత కథలపట్ల ఎంత కేర్ పుల్ గా ఉంటున్నాడు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. స్టోరీ యూనిక్ గా ఉంటేనే లాక్ చేస్తున్నాడు. లేదంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నాడు.
ప్రస్తుతం చైతన్య `వృశకర్మ` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తోన్న ఈచిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.
ఈ నేపత్యంలో చైతన్య తదుపరి చిత్రాల్ని ఒక్కొక్కటిగా లాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. `మసూద` వంటి విజయవంతమైన హారర్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు సాయికిరణ్‌తో నాగచైతన్య చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సాయికిరణ్ వినిపించిన ఆసక్తికరమైన హారర్ థ్రిల్లర్ చైతన్యకు బాగా నచ్చిందంటున్నారు. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో? చేద్దామని ప్రామిస్ చేసారుట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏషియన్ సునీల్ ముందుకొస్తున్నట్లు తెలిసింది.
అలాగే నాగచైతన్య క్లాక్స్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం ఇప్పటికే ఉంది. `వృషకర్మ` పూర్తికాగానే ఆ సినిమా పనులు మొదలవుతాయంటున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చైతన్య మాత్రం హారర్ జోనర్ విషయంలో చాలా కాన్పిడెంట్ గా కనిపిస్తున్నాడు. `వృశకర్మ` ఇచ్చిన బూస్టింగ్ తో తదుపరి చిత్రాలు కూడా అలాంటి వాటినే ప్లాన్ చేయడం ఇంట్రెస్టింగ్.







































