ప్యార‌డైజ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

The Paradise Locks New Release Date!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా `ది పారడైజ్` విడుదల తేదీపై ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సరికొత్త ఊహాగానం వినిపిస్తోంది. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయాలని భావించినా.. తాజా సమాచారం ప్రకారం ఈ లైనప్ సెప్టెంబర్ 24కి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 140 పనిదినాల సుదీర్ఘ చిత్రీకరణను పూర్తి చేసుకున్నా.. ఇంకా ఒక కీలకమైన భారీ భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు, మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న `ఇరుముడి’` చిత్రం కూడా సరిగ్గా ఆగస్టు 21వ తేదీనే తమ రిలీజ్ డేట్‌గా ప్రకటించడంతో, బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించేందుకు పారడైజ్ మేకర్స్ సెప్టెంబర్ రేస్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను అనుకున్న సమయానికి... అత్యున్నత నాణ్యతతో ముగించేందుకు చిత్ర యూనిట్ ప్రస్తుతం రాత్రి పగలు అనకుండా మల్టిపుల్ యూనిట్స్‌తో కఠినమైన నైట్ షెడ్యూల్స్ నిర్వహిస్తోంది. నాని సైతం ఈ చిత్రం కోసం భారీ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో పాటు డబుల్ షిఫ్టులు చేస్తూ ఎంతో శ్రమిస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘షికాంజా మాలిక్’ అనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తుండగా.. సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు , రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. భారీ గెడ్డం, జడలు వేసుకున్న జుట్టుతో అణచివేతకు గురైన వర్గాల తరఫున పోరాడే ఒక వీరుడిగా నాని కనిపించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఈ చిత్రంపై తాజా వాయిదా వార్తలతో సంబంధం లేకుండా అభిమానుల్లో అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి.

The Paradise