ఎన్టీఆర్ vs ధనుష్ - టాలీవుడ్ vs కోలీవుడ్
NTR vs Dhanush - Tollywood vs Kollywood
ఈమధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చెయ్యగానే తమిళ ఆడియన్స్ భగ్గుమన్నారు. #NTRxTrivikram.. శివుడి కుమారుడు.. పార్వతి దేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో అంటూ ఎన్టీఆర్ ఈ క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ని అనౌన్స్ చేసారు. దానికి ట్యాగ్ లైన్ గా.. Born in the North అని పెట్టడంతో.. కుమారస్వామి సౌత్ లో జన్మించారు, నార్త్ లో కాదు, పురాణాలు మార్చొద్దు అంటూ తమిళం నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి.
అసలు #NTRxTrivikram సినిమా ఎలా చేస్తారో చూస్తామంటూ తమిళనాడు పాలిటికల్ లీడర్స్ రచ్చ మొదలు పెట్టారు. ఇలాంటి సమయంలోనే హీరో ధనుష్ తమిళ్ మురుగన్ అనే సినిమాని అనౌన్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, తమిళ ప్రజలు, వారి నేలకి రాజు, నాయకుడు.. తమిళ్ మురుగన్ అంటూ ధనుష్ పోస్ట్ పెట్టారు.
వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ ఈ సినిమాని అనౌన్స్ చెయ్యగానే.. కావాలనే ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రానికి యాంటీ గా ఈ సినిమాని అనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ vs ధనుష్ - టాలీవుడ్ vs కోలీవుడ్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో అభిమానుల నడుమ రచ్చ స్టార్ట్ అయ్యింది.







































