అఖిల్ లెనిన్ తో ఫస్ట్ డే కుమ్మేసాడు

Lenin Opens Strong At Box Office


ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ మూడేళ్ళ భారీ గ్యాప్ తో లెనిన్ తో అక్కినేని అభిమానులకు కావాల్సిన ట్రీట్ ఇచ్చాడు. నిన్న శుక్రవారం విడుదలైన అఖిల్ లెనిన్ కి అన్ని వైపులా నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో లెనిన్ టీమ్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంది. అఖిల్ అయితే ఆగలేక కదిలిపోయి తండ్రి నాగ్ ని కన్నీళ్లతో హగ్ చేసుకున్నాడు.

మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లెనిన్ చిత్రంలో అఖిల్ రగడ్ లుక్ కి, అఖిల్ యాక్టింగ్ కి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. థమన్ BGM, సినిమాటోగ్రఫీ అన్ని లెనిన్ కి ప్లస్ గా నిలిచాయి. మురళి కిషోర్ అబ్భురి కథని ఇంకా కొత్తగా ప్రెజెంట్ చేసి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అఖిల్ లెనిన్ తో మొదటిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టాడు. లెనిన్ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 16.7 కోట్ల గ్రాస్ తీసుకువచ్చినట్లుగా మేకర్స్ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. లెనిన్ బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్ నెంబర్లు నమోదు చెయ్యడం పక్కాగా కనిపిస్తుంది ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ చూస్తుంటే.

అఖిల్ కూడా లెనిన్ తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చినట్టే. లెనిన్ కి మొదటి రోజుకన్నా రెండో రోజు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. కారణం రెండోరోజు నైజాం లో లెనిన్ కి థియేటర్స్ యాడ్ చేస్తున్నారు. సో రెండోరోజు లెనిన్ నెంబర్లు కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. 

Lenin Day 1 Box Office Collections