పవన్ కళ్యాణ్ కుడి భుజం సర్జరీ సక్సెస్
Pawan Kalyan Undergoes Successful
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ సైనస్ కి సర్జరీ చేయించుకున్నారు. తర్వాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న పవన్ మరోసారి ముంబై కి రెండు భాజాలకు గతంలో అంటే 2016 సినిమా షూటింగ్స్ సమయంలో తగిలిన గాయాలకు చికిత్స తీసుకోవడానికి వెళ్లారు.
అక్కడి వైద్యులు అన్ని టెస్ట్ లు చేసి ఆయన రెండు భుజాలకు వీలైనంత తొందరగా శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించగా పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీ కార్యకాలాపాలను, ప్రభుత్వ కార్యాలపాలను ముగించుకుని రెండు రోజులక్రితమే భార్య అన్న తో కలిసి సర్జరీ కోసం ముంబై వెళ్లారు.
డాక్టర్స్ రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి అని చెప్పి దానిలో భాగంగా ముందు కుడి భుజానికి శస్త్ర చికిత్స నిర్వహించారు. మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స జరిగినట్లుగా తెలుస్తుంది. సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించారు.
2016లో తగిలిన గాయాలకు తోడు, పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రం అవడంతో వాటికి ఇప్పటికి పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారు.







































