ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sreeleela is being trolled mercilessly

శ్రీలీల ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు

Sreeleela is being trolled mercilessly

 

లెనిన్ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల తప్పుకోవడం అఖిల్ కి ప్లస్ అయ్యింది. అమ్మడు శ్రీలీల హీరోయిన్ అయితే లెనిన్ కూడా ప్లాప్ అయ్యేది అంటూ చాలామంది ఓపెన్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నిన్న శుక్రవారం విడుదలైన లెనిన్ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.

లెనిన్ లో శ్రీలీల లేకపోవడం వల్లే సినిమా హిట్ అయ్యింది. లేదంటే శ్రీలీల దురదృష్టం లెనిన్ కి అంటుకునేది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. శ్రీలీల డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె లెనిన్ నుంచి తప్పుకోవడం ఆ ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే రావడం జరిగింది.

శ్రీలీల వరస ప్లాప్స్ లో ఉండడం, ఆమె ఏ సినిమా చేసినా ప్లాప్ అనే ముద్ర పడడంతో ఇప్పుడు లెనిన్ నుంచి ఆమె తప్పుకుని మంచి పని చేసింది. అఖిల్ లెనిన్ హిట్ అవడానికి కారణమైంది. శ్రీలీల వల్ల ఇప్పటికే కష్టాల్లో ఉన్న అఖిల్ మళ్లీ సఫర్ అయ్యేవాడు, శ్రీలీల లో డాన్స్ టాలెంట్ తప్ప యాక్టింగ్ టాలెంట్ లేదు.

క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఒకటే ఎక్స్ప్రెషన్ పలికిస్తుంది. ఆమె వాయిస్ కూడా చిన్న పిల్లల వాయిస్. అది ఆమెకు మైనస్. ఏది ఏమైనా శ్రీలీల లెనిన్ నుంచి తప్పుకుని అఖిల్ నెత్తిన పాలు పోసింది అంటూ శ్రీలీల ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Sreeleela gets Trolled after Lenin Release