ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas film: Actor serious after insect bite

కీటకం కాటుతో ఆసుప‌త్రిలో నటుడు రాజేష్ శర్మ!

Prabhas film: Actor serious after insect bite

ప్రముఖ నటుడు రాజేష్ శర్మ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. `ఫౌజీ`, `స్పిరిట్` వంటి భారీ చిత్రాల షూటింగ్ సమయంలో ఓ కీటకం కాటు వేయడంతో ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని సమాచారం. తొలుత సాధారణంగానే అనిపించినా?  ఆ కాటు కారణంగా తీవ్రమైన అలర్జీ .. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆయ‌న్ని  సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు స‌మాచారం.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంద‌నే విష‌యం బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. షూటింగ్ సెట్స్‌లో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం చిత్రబృందాన్ని షాక్‌కు గురిచేసింది. శ‌ర్మ త్వరగా కోలుకోవాలని  టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా  కోరుకుంటున్నారు. రాజేష్ శర్మ వంటి సీనియర్ నటుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం పట్ల చిత్ర పరిశ్రమ  ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ సంఘటన నేపథ్యంలో సినిమా షూటింగ్ సెట్స్‌లో నటీనటులు మరియు సిబ్బంది భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. భారీ ప్రాజెక్టుల షూటింగ్ సమయంలో రక్షణ చర్యలు ఎంతటి ముఖ్యమో ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చూపుతోంది. రాజేష్ శర్మ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, షూటింగ్ సెట్స్‌లో ఇలాంటి అపాయాలు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. .

 

Insect bites Rajesh Sharma during Prabhas film shoot