సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి

Colours Swati gets Married Again

 

కలర్స్ స్వాతి మళ్లీ పెళ్లి చేసుకుంది. గతంలో స్వాతి 2018లో మలయాళీ పైలట్ వికాస్ వాసును పెళ్లి చేసుకుని కొద్దిరోజులకే భర్త వికాస్ వాసుతో విభేదాలతో విడిపోయింది. విడాకులు తర్వాత కలర్స్ స్వాతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఆమెకు అనుకున్నంతగా విజయాన్ని అందించలేదు. ఆతర్వాత సైలెంట్ అయిన స్వాతి..

మళ్లీ పెళ్లి పీటలెక్కినట్లుగా స్వయంగా చెప్పి అందరికి షాకిచ్చింది. ఈరోజు జులై 8 న స్వాతి వివాహం సింపుల్ గా జరిగింది. అది కూడా టాలీవుడ్ డైరెక్టర్ మంత్ ఆఫ్ మధు ఫేమ్  శ్రీకాంత్ నాగోతితో ఆమె వివాహం జరిగింది. ఆ విషయాన్ని స్వాతి ఫొటోస్ తో పాటుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే స్వాతి పెళ్లి ని వెనుకవైపుగా తీసిన రెండు ఫోటోలను మాత్రమే షేర్ చేసింది. ఫేస్ లు కనిపించలేదు. స్వాతి రీఎంట్రీ మూవీ మంత్ ఆఫ్ మధుకి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఇక స్వాతి మళ్లీ పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆమెకు స్నేహతులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Colors Swathi Marries Director Srikanth Nagothi