ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sunita sensational comments on husband Govinda

గోవిందా భార్య సునీత సంచలన కామెంట్స్

Sunita sensational comments on husband Govinda


బాలీవుడ్ నటుడు గోవిందా పై ఆయన భార్య సునీత అహుజా పలుమార్లు సంచలన కామెంట్స్ చేసారు. గోవిందా కు ఇతర హీరోయిన్స్ తో అఫైర్లు ఉన్నాయంటూ భర్త గోవిందా పై ఆమె ఆరోపణలు చేసారు. కానీ ఇప్పుడు సునీత తన భర్తకు 10 కాదు 50 అఫైర్స్ ఉన్నా తన చివరి శ్వాస వరకు తన భర్తను విడిచిపెట్టను అంటూ ఓ షో లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లాక్ అప్: సచ్ యా సజా షోలో సునీత అహుజా పాల్గొనగా.. ఆ షోకి వైల్డ్ కార్డు గా వచ్చిన ఓ కంటెస్టెంట్ సునీతను గతంలో ఆమె భర్తపై చేసిన ఆరోపణల విషయంలో ప్రశ్నించగా దానికి గోవిందా భార్య సునీత.. తన లైఫ్ గురించి మాట్లాడే ముందు తన పరిస్తితిని అర్ధం చేసుకోవాలని, దేన్ని ఎలా ఫేస్ చెయ్యాలో తనకు తెలుసు అని చెప్పారు.

అంతేకాకుండా గోవింద తన భర్త అని, ఆయన ఎలాంటి వాడైనా, ఆయనపై ఎంతటి ప్రచారం జరిగినా తన ప్రేమ మారదని, ఆయనకు పది కాదు 50 వివాహేతర సంబంధాలున్నా తాను ఆయన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, తన చివరి శ్వాస వరకు తన భర్తను ప్రేమిస్తూనే ఉంటానని స్పష్టం చేసారావిడ. 

Sunita Ahuja sensational comments on husband Govinda