Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Strong warning to the makers of God of War

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై తమిళాగ్రహం

Strong warning to the makers of God of War


యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రీసెంట్ గానే  గాడ్ ఆఫ్ వార్ అనౌన్సమెంట్ వచ్చిన విషయం తెలిసిందే. The Son of Shiva. The Pride of Parvathi. The Eternal Commander. And, once again with TRIVIKRAM.. అంటూ స్వయంగా హీరో ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసారు.

అయితే ఈ చిత్రం అనౌన్సమెంట్ వచ్చిన తర్వాత రోజే  గాడ్ ఆఫ్ వార్ పై తమిళులు ఈ మూవీపై విరుచుకుపడ్డారు. ఈ చిత్రంలో సుబ్రహ్మణ్యస్వామిని ఉత్త‌ర భార‌తంలో పుట్టిన‌వాడిగా.. ఉత్త‌ర‌భార‌త‌దేశం దైవంగా చూపిస్తున్నారని మా ఆరాధ్య దైవాన్ని తప్పుగా చూపిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా చేస్తే అది చరిత్రను తప్పుదోవ పట్టించడమేనని, సుబ్రహ్మణ్యస్వామి తమిళుల ఆరాధ్య దైవమని, ఆయన సంస్కృతి, చరిత్ర తమిళ గడ్డతోనే ముడిపడి ఉన్నాయని NTK పార్టీ అధినేత సిమాన్ హెచ్చరిస్తున్నారు. సినిమా ప్రయోజనాల కోసం తమిళుల దైవాన్ని వేరే ప్రాంతానికి చెందినవాడిగా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 

God of War makers get a strong warning