నెగిటివ్ ప్రచారంపై డైరెక్టర్ క్లారిటీ!
Director clarifies regarding negative publicity!భారీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించే క్రమంలో నటీనటుల కాల్‌షీట్ల సర్దుబాటు - చివరి నిమిషంలో జరిగే మార్పులు సర్వసాధారణం. ఇటీవల విడుదలైన `వెల్‌కమ్ టు ది జంగిల్` చిత్రంలో కూడా ఇలాంటి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ మొదట నడించాల్సి ఉండగా అటుపై ఆయన స్థానంలో సునీల్ శెట్టి చేరారు. దీంతో సీనియర్ స్టార్ ను తప్పించి శెట్టిని చేర్చారు? ఏంటి అనే దానిపై కొంత డిస్కషన్ జరిగింది. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ దర్శకుడు అహ్మద్ ఖాన్ అసలు విషయాన్ని పంచుకున్నారు.
`సంజయ్ దత్ కథను - తన పాత్రను ఎంతో ఇష్టపడ్డారు. పాత మిత్రులైన అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్‌లతో కలిసి స్క్రీన్ పంచుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపించారు. షూటింగ్ ప్రారంభం అనంతరం సంజయ్ దత్ రెండు రోజుల పాటు చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు. అయితే చిత్రంలో 30 మందికి పైగా నటీనటులు ఉండటం వల్ల అందరి డేట్లను ఒకేసారి సమన్వయం చేయడం సవాలుగా మారింది. సంజయ్ దత్ వైద్య చికిత్స నిమిత్తం అత్య వసరంగా అమెరికా వెళ్లాల్సి రావడం తో భారీ తారాగణం ఉన్న షెడ్యూల్‌ను మార్చడం వీలు పడలేదు. దీంతో చిత్ర బృందంతో ఎలాంటి విభేదాలు లేవని, కేవలం డేట్ల సమస్య వల్లే ఆయన తప్పుకున్నారని అహ్మద్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.
ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నా? సంజయ్ దత్ చిత్ర నిర్మాణానికి ఎంతో బాధ్యతాయుతంగా సహకరించారు. తన వల్ల షూటింగ్‌కు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా సునీల్ శెట్టికి ఫోన్ చేసి తన పాత్రను చేయవలసిందిగా కోరారు. అలాగే సునీల్ శెట్టి మొదట చేయాలనుకున్న పాత్రను జాకీ ష్రాఫ్‌కు అప్పగించేలా సర్దుబాటు చేశారు. ఆ విధంగా ఒక అగ్ర నటుడు ప్రాజెక్ట్ నుండి వైదొలిగినా? స్నేహపూర్వక వాతావరణంలో ప్రత్యామ్నాయాన్ని సూచించడం బాలీవుడ్ పరిశ్రమలోని నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవానికి ప్రతీకగా చెప్పొచ్చు.








































