జాన్వీ కోలీవుడ్ డెబ్యూ దర్శకుడు?
Janhvi Kapoor to Enter Kollywoodటాలీవుడ్లో బ్యాక్-టు-బ్యాక్ భారీ విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఇప్పుడు చెన్నై సినీ ఇండస్ట్రీపై కన్నేసింది. తన తల్లి, దివంగత లెజెండ్ శ్రీదేవికి ఎంతో ఇష్టమైన తెలుగు చిత్రసీమలో రెండు బ్లాక్ బస్టర్లు అందుకుంది. ఎన్టీఆర్ - దేవర, రామ్ చరణ్ సరసన నటించిన `పెద్ది` వంటి క్రేజీ ప్రాజెక్టులతో సత్తా చాటిన ఈ బ్యూటీ, తదుపరి అడుగు కోలీవుడ్ వైపు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అనువుగా కథలను వింటున్న జాన్వీ.. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా సందడి చేయడానికి సిద్ధమవుతోందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్‌కు చెందిన `నీలం ప్రొడక్షన్స్` నిర్మించనున్న `కురత్తి` అనే ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ ద్వారా జాన్వీ కపూర్ తమిళంలోకి అడుగుపెట్టబోతోంది. దర్శకుడు సర్గుణం తెరకెక్కించనున్న ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ లీడ్ రోల్ పోషించనుందని కోలీవుడ్ మీడియాలో గట్టి ప్రచారం సాగుతోంది.
అయితే మేకర్స్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. వెండితెరపైనే కాకుండా ఓటీటీ స్పేస్‌లోనూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పించాలనే ఆలోచనతోనే జాన్వీ ఈ డెసిషన్ తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.








































