త్రిష నే ఫైనల్
Trisha May TVK Contest By Election
విజయ్ టీవీకే పార్టీలో చేరి ఆయన వదులుకున్న ఈస్ట్ తిరుచ్చి అసెంబ్లీ స్థానం నుంచి నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారాన్ని రాఘవ లారెన్స్ కొట్టిపారేశారు. నేను అంత పెద్ద వ్యక్తిని కాదు, విజయ్ ని నముకున్నోళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళే ఆ స్థానంలో పోటీకి వస్తారని తేల్చేసారు.
దానితో మరోసారి నటి త్రిష నే ఈస్ట్ తిరుచ్చి నుంచి పోటీ చేసే ఛాన్స్ వుంది అంటూ ప్రచారం మొదలైంది. విజయ్ ఆ స్థానం వదులుకున్నప్పటి నుంచి త్రిష అక్కడి నుంచి పోటీ చేస్తుంది.. గెలిచి విజయ్ ప్రభుత్వంలో కీలక కాదు కాదు డిప్యూటీ సీఎం అవుతుంది అనే ప్రచారం జరిగింది.
త్రిష టీవీకే పార్టీలో చేరుతుంది. మాములుగా పదవి ఇస్తే బాగోదు కనకనే త్రిష ఈస్ట్ తిరుచ్చి నుంచి పోటీ చేసేలా విజయ్ ఒప్పిస్తారని అంటున్నారు. ఇక ఇప్పుడు రాఘవ లారెన్స్ కూడా తప్పుకోవడం త్రిష నే ఈస్ట్ తిరుచ్చి అసెంబ్లీ స్థానంలో నిలబడుతుంది, ఇది ఫైనల్ అంటూ మళ్లీ తెరపైకి త్రిష టాపిక్ వచ్చింది.







































