సమంత స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Samantha's strong comeback
సమంత స్టార్ హీరోలకు, కమర్షియల్ మూవీస్ కి దూరమై చాలా కాలమే అయ్యింది. అల్లు అర్జున్ పుష్ప 1 స్పెషల్ సాంగ్ తర్వాత ఆమె స్టార్ హీరోల సినిమాల్లో కనిపించింది లేదు. విజయ్ దేవరకొండ తో ఖుషి, గుణశేఖర్ శాకుంతలం సినిమాలో డిజప్పాయింట్ చేసిన సమంత మళ్లి చాలా రోజులకు విమెన్ సెంట్రిక్ మూవీ మా ఇంటి బంగారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సమంత మా ఇంటి బంగారం చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. సమంత స్టార్ పవర్ మా ఇంటి బంగారం ఓపెనింగ్స్ ని ప్రభావితం చేసాయనడంలో సందేహమే లేదు. నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి అనౌన్స్ చేసారు.
మరి ఈ రేంజ్ ఓపెనింగ్స్ సమంత సినిమాకి వచ్చాయంటే ఆమె స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే. ఇకపై సమంత స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి. అయితే మా ఇంటి బంగారం చిత్రానికి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాంఈ టాక్ తో ఎన్ని కోట్ల కలెక్షన్స్ తీసుకొస్తుందో అనేది.







































