ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Alia Bhatt says daughter Raha is meant for the stage

రాహా కూడా నటి అవుతుందేమో - అలియా

Alia Bhatt says daughter Raha is meant for the stage


స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అలియా భట్ హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరైంది. స్టార్ కిడ్ కావడంతో ఆమెకు అవకాశాలు ఎక్కువ వస్తాయనే విషయాన్ని ఆమె ఎప్పటికప్పుడు తోసి పుచ్చుతుంది. అవకాశాలు ఈజీగా వచ్చినా ఎక్కడైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని చెప్పే అలియా భట్ ప్రస్తుతం ఆల్ఫా ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది.

ఆల్ఫా లో గూడచారి పాత్రలో అలియా భట్ యాక్షన్ ఎలా ఉండబోతుందో అనేది మచ్చుకు ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అలియా భట్ తన కూతురు రాహా గురించిన ముచ్చట్లను మీడియా తో పంచుకుంది. మా అమ్మాయి రాహాలో కూడా సిల్వర్ స్క్రీన్ పై రాణించే లక్షణాలు ఉన్నాయి. కొన్నిసార్లు రాహా సినిమాల కోసమే పుట్టిందని అనిపిస్తుంటుంది.

సినిమాలనే కాదు రాహా కు చాలా విషయాలపై ఆసక్తి ఉంది. గేమ్స్ అలాగే ఇతర యాక్టీవిటీస్ చాలా ఎనేర్జిటిక్ పాల్గొంటుంది. సాంగ్స్ వింటుంది, డాన్స్ చేస్తుంది.. ఇలా ప్రతి ఒక్క విషయంలో రాహా ఫోకస్ పెడుతుంది అంటూ అలియా భట్ కూతురు రాహా గురించి చెప్పుకొచ్చింది.

Alia Bhatt says daughter Raha shows early stage talent