తిరుమల శ్రీవారి సేవలో మోక్షజ్ఞ
Mokshagna Visits Tirumala
నందమూరి నటవారసుడు, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఎంత సస్పెన్స్ నడుస్తుందో తెలిసిన విషయమే. బాలయ్య బర్త్ డే లు వస్తున్నాయ్, పోతున్నాయి, మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనౌన్సమెంట్ వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా సెట్ లో కనిపించలేదు.
మొదటి సినిమా ఆగిపోయినా రెండో సినిమా కూడా ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. మోక్షు హీరోలా ట్రాన్ఫర్మేషన్ తో కనిపిస్తుంటే నందనమూరి అభిమానులు ఈ కటౌట్ ఎప్పుడు తెరగేంట్రం చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ ఎప్పుడు లో ప్రొఫైల్ మైంటెన్ చేస్తాడు.
తాజాగా మోక్షజ్ఞ తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మోక్షజ్ఞ తిరుమల వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పద్ధతిగా పట్టు పంచె లో వచ్చిన మోక్షజ్ఞను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.
దర్శనానంతరం ఆలయ అధికారులు, అర్చకులు మోక్షజ్ఞ కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. అయితే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి ముందు ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అభిమానులు అనుకుంటున్నారు.







































