ఏప్రిల్ 3 న థియేటర్స్ శర్వానంద్ బైకర్, నిహారిక రాకాస చిత్రాలు పోటీ పడ్డాయి. భారీ ప్రమోషన్స్ మాత్రమే కాదు శర్వా బైకర్ కి ప్రభాస్ సపోర్ట్ చేస్తే. నిహారిక రాకాస కి రామ్ చరణ్ సపోర్ట్ చేసారు. దానితో రెండు సినిమాల పై మంచి హైప్ పెరిగింది. ఇక నువ్వా-నేనా అని పోటీపడిన బైకర్, రాకాస రెండు చిత్రాలకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.
కానీ ప్రేక్షకులు అటు బైకర్, ఇటు రాకాస రెండు చిత్రాలను హిట్ చేసారు. థియేటర్స్ లో పోటీ పడిన ఈ రెండు చిత్రాలు ఓటీటీ వేదికగా పోటీపడుతున్నాయి. అది కూడా ఒకే ప్లాట్ ఫామ్ నుంచి రావడం గమనార్హం. నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 1 న బైకర్, రాకాస రెండు చిత్రాలు ఒకేసారి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
సో ఈ రెండు సినిమాల నడుమ థియేటర్స్ లోనే కాదు ఇప్పుడు ఓటీటీ లోను పోటీ కనిపిస్తుంది. చూద్దాం ఏ సినిమాకి ఎంత రెస్పాన్స్ వస్తుందో అనేది.





టాక్సిక్ : ఏం జరుగుతుంది యశ్ 
Loading..