ఓవర్సీస్ పై హోప్స్ వదులుకోవాలా?
Movies Hope on Overseas market
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలకు ఓవర్సీస్ అనేది అతి పెద్ద మార్కెట్. భారీ బడ్జెట్ సినిమాలైనా, చిన్న సినిమాలైనా, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను మాత్రమే కాదు యాక్షన్ ప్యాకెడ్ మూవీస్ ని, కమర్షియల్ సినిమాలను కూడా ఓవర్సీస్ ఆడియన్స్ ఆదరిస్తారు, అద్భుతమైన కలెక్షన్స్ అందిస్తారు.
రీసెంట్ గా మలయాళంలో విడుదలైన మోహన్ లాల్ దృశ్యం 3 డివైడ్ టాక్ తోనే ఓవర్సీస్ లో భారీ నెంబర్లు నమోదు చేసింది. ఆ తర్వాత వచ్చిన పెద్ది చిత్రానికి ఓవర్సీస్ లో కలెక్షన్స్ రాకపోవడం నిజంగా విచిత్రమే. అలాగని పెద్ది ప్లాప్ అవ్వలేదు. కొన్ని లోపలున్నప్పటికీ మెగా అభిమానులైనా ఓవర్సీస్ లో పెద్ది ని అక్కున చేర్చుకోకపోవడం విడ్డురమే.
ఆ విషయమే పెద్ది నిర్మాత కిలారు సతీష్ పెద్ది సక్సెస్ మీట్లో చెప్పారు. ఇకపై కేసు స్టడీనే.. పెద్ది కి ఓవర్సీస్ లో అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు, ఇకపై ఓవర్సీస్ మార్కెట్ పై అంచనాలు తప్పడం ఖాయమంటూ ఆయన మాట్లాడిన తీరు పెద్దికి అక్కడ ఎంత రెస్పాన్స్ ఉందొ అర్ధమవుతుంది.
మరి ఇకపై ఓవర్సీస్ మార్కెట్ పై నిర్మాతలు ఆశలు వదులుకోవాల్సిందే? ఓవర్సీస్ ని నమ్ముకుని రిలీజ్ చేస్తే బొక్క బోర్లా పడడం ఖాయమేనా? ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ.







































