సంక్రాంతికి మెగా బాస్ ట్రీట్ లోడింగ్
Massive update for Chiranjeevi fansమెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం (మెగా 158) బాక్సాఫీస్ వద్ద మరో సంక్రాంతి ట్రీట్ కు సిద్ధమవుతోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన గ్రాండ్ ఈవెంట్‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) ఈ ప్రాజెక్ట్‌ను శరవేగంగా తెరకెక్కిస్తుండగా, తాజాగా పొల్లాచ్చిలో ప్లాన్ చేసిన కీలకమైన షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా కంప్లీట్ అవ్వడంతో చిత్రయూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి పబ్లిక్ అప్పియరెన్సులను బట్టి ఈ సినిమాలో ఆయన వింటేజ్ మాస్ లుక్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.
పొల్లాచ్చి షెడ్యూల్ సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో `మెగా 158` టీమ్ ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు పూర్తి నమ్మకంతో అడుగులు వేస్తోంది. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ - డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం... పైగా చిరంజీవికి ఎంతో అ కలిసివచ్చిన సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి రేసులో మెగా ట్రీట్ ఖాయం చేస్తూ.. ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది.







































