Advertisementt

ఇకపై దేవర 2 డౌటే

Fri 24th Apr 2026 04:26 PM
devara 2  ఇకపై దేవర 2 డౌటే
NTR - Devara 2 ఇకపై దేవర 2 డౌటే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో వచ్చిన దేవర చిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ భుజాన వేసుకుని సినిమాని హిట్ చేసారు కానీ లేదంటే దేవర ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయేది. అందుకే దేవర సీక్వెల్ దేవర 2 పై అనేక అనుమానాలు నెలకొన్నా అటు కొరటాల ఇటు ఎన్టీఆర్ దేవర 2 ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

కొరటాల కూడా గత రెండేళ్లుగా దేవర 2 స్క్రిప్ట్ ని చెక్కుతున్నారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు దేవర 2 ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కారణం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. దేవర పార్ట్ 1 వచ్చే ఏడాది జూన్ లో విడుదలవుతుంది. ఆతర్వాత పార్ట్ 2 ఉంటుంది. 

అయితే ప్రశాంత్ నీల్ కెజిఎఫ్, సలార్ మాదిరి కాకుండా డ్రాగన్ పార్ట్ 1 విడుదల కాగానే పార్ట్ 2 ని విడుదల చేసేలా షూటింగ్ చేసేస్తున్నారట. అంటే ధురంధర్ మాదిరి పార్ట్ 1 వచ్చిన కొన్ని నెలలకే పార్ట్ 2 వచ్చేలా నీల్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడప్పుడే ఖాళీ అవ్వరు.

అటు కొరటాల శివ కూడా బాలయ్య తో సినిమా స్టార్ట్ చేసేసరికి చాలా టైమ్ పడుతుంది. ఎన్టీఆర్ కూడా దేవర 2 పై సీరియస్ గా లేడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. సో దీనిని బట్టి దేవర 2 డౌట్ అనే చెప్పాలి.

NTR - Devara 2:

Devara 2 update

Tags:   DEVARA 2
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ