Advertisementt

ఓటీటీలోకి రాబోతున్న కాంట్రవర్సీ ఫిలిం

Fri 24th Apr 2026 05:17 PM
the kerala story  ఓటీటీలోకి రాబోతున్న కాంట్రవర్సీ ఫిలిం
Controversial film coming to OTT ఓటీటీలోకి రాబోతున్న కాంట్రవర్సీ ఫిలిం
Advertisement
Ads by CJ

ఆదా శర్మ మెయిన్ లీడ్లో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ సంచలనాలకు, కాంట్రవర్సీలకు నెలవుగా మారటమే కాదు అంతకు మించిన కలెక్షన్స్ తో రికార్డ్ లు క్రియేట్ చేసింది. ది కేరళ స్టోరీ కి సీక్వెల్ గా తెరకెక్కిన ది కేరళ స్టోరీ పార్ట్ 2 విడుదలకు ముందు కాంట్రవర్సీ అయినా.. విడుదల తర్వాత మూగబోయింది.

అటు కలెక్షన్స్ పరంగా వీక్ అయ్యింది. థియేటర్స్ లో పెద్దగా హడావిడి చెయ్యని కేరళ స్టోరీ పార్ట్ 2 ఇపుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. పార్ట్ 1 ఓటీటీ హక్కులను జీ 5 దక్కించుకోగా.. ఇప్పుడు ది కేరళ స్టోరీ పార్ట్ 2 డిజిటల్ రైట్స్ ని కూడా జీ 5 సొంతం చేసుకుంది.

తాజాగా జీ 5 ది కేరళ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసారు. మే 8 నుంచి కేరళ స్టోరీ 2 స్ట్రీమింగ్ కి రానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. హిందీ వెర్షన్ తో పాటుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కేరళ స్టోరీ 2 అందుబాటులోకి రానున్నట్లుగా ప్రకటించారు.

Controversial film coming to OTT:

The Kerala Story 2 OTT Release Date Locked

Tags:   THE KERALA STORY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ