Advertisementt

కవిత సక్సెస్ ని డిసైడ్ చేసే సభ

Thu 23rd Apr 2026 03:44 PM
kavitha  కవిత సక్సెస్ ని డిసైడ్ చేసే సభ
Kavitha to launch political party in Medchal కవిత సక్సెస్ ని డిసైడ్ చేసే సభ
Advertisement
Ads by CJ

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడి.. కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25 న అంటే ఈ శనివారం కొత్త పార్టీ ని అనౌన్స్ చేయబోతుంది. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ని కాదని కొత్త పార్టీ పెట్టి తన సత్తా ఏమిటో చూపించాలనుకుంటుంది. అందులో భాగంగానే తండ్రి కేసీఆర్ ని పక్కనపెట్టి అన్న కేటీఆర్, బావ హరీష్ లను, కాంగ్రేస్, బిజెపి లను రెవెట్టేస్తుంది.

అయితే కవిత బీఆర్ఎస్ నుంచి తనకు చాలామంది సపోర్ట్ ఉంది, కేసీఆర్ అధికారాన్ని తిరస్కరిస్తున్న బీఆర్ ఎస్ నేతలు తన పార్టీలో చేరేందుకు టచ్ లో ఉన్నారంటూ కవిత పలుమార్లు చెప్పింది. అయితే మేడ్చల్ ఆవిర్భావ సభలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి పార్టీ పేరు ని పార్టీ గుర్తు ను ప్రకటించబోతుంది. ఆ సభను విజయవంతం చేసేందుకుగాను చాలా కష్టపడుతుంది.

మేడ్చల్ ఆవిర్భావ సభ తోనే తనకున్న పలుకుబడిని చూపించాలి అనుకుంటుంది. ఇక బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ని కాదని వచ్చేవాళ్లంతా మేడ్చల్ ఆవిర్భావ సభలో కనిపించాల్సిందే. ఒకవేళ అదే నిజమైతే కవిత కు వచ్చే సపోర్ట్ ఆమె సక్సెస్ ని డిసైడ్ చేస్తుంది. తండ్రి కేసీఆర్ ని కాదని కవిత వద్దకు ఎవరెవరు నేతలు వచ్చి ఆమె ను సపోర్ట్ చేస్తారా అని అటు బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఆమె బలం, బలహీనత అంతా ఈ మేడ్చల్ ఆవిర్భావ సభలో బయటపడుతుంది. ఈ సభ ద్వారా తన రాజకీయ సత్తాను చాటి, రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆమె భావిస్తున్నది. మరి ఎవరెవరు బీఆర్ఎస్ ని వీడి కవిత చెంతకు చేరుతారో చూడాలి. 

Kavitha to launch political party in Medchal:

Kavitha to launch political party in Medchal on April 25

Tags:   KAVITHA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ