Advertisementt

పెద్ది - ఇదైనా ఫైనల్ అంటారా..

Thu 23rd Apr 2026 03:21 PM
peddi  పెద్ది - ఇదైనా ఫైనల్ అంటారా..
Shruti Haasan joins Ram Charan Peddi పెద్ది - ఇదైనా ఫైనల్ అంటారా..
Advertisement
Ads by CJ

ఈమధ్య కాలంలో ఏ ఐటెం సాంగ్ కి ఇంత మంది హీరోయిన్స్ పేర్లు వినిపించలేదు. పెద్ది చిత్రానికి వినిపించిన స్పెషల్ సాంగ్ హీరోయిన్స్ పేర్లు అన్ని ఇన్ని కావు. పాన్ ఇండియా మూవీ పెద్ది లో రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ లో జోడి కట్టేందుకు హీరోయిన్ ముందుకు రావటం లేదా, లేదంటే అనేది తెలియదు కానీ.. రోజుకో హీరోయిన్ పేరు ప్రచారంలోకి వస్తుంది.

మృణాల్ ఠాకూర్ దగ్గర నుంచి మానస వారణాసీ, నిన్నగాక మొన్న సంయుక్త మీనన్ ఫిక్స్ అన్నారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ అంటున్నారు. ఫైనల్ గా శృతి హాసన్ పేరే పెద్ది ఐటమ్ సాంగ్ కోసం గట్టిగా వినిపిస్తున్న పేరు. చివరికి ఇదైనా ఫైనల్ చేస్తారా లేదా అనే విషయంలో మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

దర్శకుడు బుచ్చి బాబు ఎందుకు బాలీవుడ్ హీరోయిన్స్ ని సంప్రదించలేదు అని మెగా ఫ్యాన్స్ తెగ గింజుకుంటున్నారు. పెద్ది లాంటి కంటెంట్ ఉన్న సినిమాలో చిన్న చితక హీరోయిన్స్ కాకుండా నార్త్ నుంచి హీరోయిన్ ని దించినట్టయితే అదిరిపోయేది అనేది వారి బాధ. ఇప్పుడు శృతి హాసన్ ఓకే.

కానీ ఫైనల్ గా మళ్లీ ఎవరు పేరు చెబుతారో అనే టెన్షన్ మెగా ఫ్యాన్స్ లో కనబడుతుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.

Shruti Haasan joins Ram Charan Peddi :

Shruti Haasan joins Ram Charan Peddi for a special song

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ