Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Maa Inti Bangaram release on June 19th

బంగారం హడావిడి ఎక్కడా..

Maa Inti Bangaram release on June 19th


ఖుషి, శాకుంతలం చిత్రాల తర్వాత బ్రేక్ తీసుకుని తన ఓన్ బ్యానర్ లో భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మా ఇంటి బంగారం చిత్రం చేసింది. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 19 కి పోస్ట్ పోన్ చేసారు. మే చివరిలోనే మా ఇంటి బంగారం ట్రైలర్ వదిలారు మేకర్స్.

సమంత యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో హైలెట్ అవడమే కాదు... ఈ చిత్రం పై మా ఇంటి బంగారం ట్రైలర్ అంచనాలు పెరిగేలా చేసింది. అప్పటినుంచి మళ్ళీ మా ఇంటి బంగారం మేకర్స్ కామ్ గా కనిపిస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా 9 రోజుల సమయమే ఉంది. సమంత మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అభిమానులు వెయిటింగ్.

బంగారం హడావిడి ఎక్కడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి నందిని రెడ్డి, సమంత, రాజ్ నిడిమోరు కలిసి మా ఇంటి బంగారం చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేస్తారా.. అందరిలో ఎలా అంచనాలు పెంచుతారా అనే ఆసక్తి మాత్రం ఎక్కువైపోతోంది. ఈ చిత్రంతో సమంత కమ్ బ్యాక్ అవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Maa Inti Bangaram