Advertisementt

ఈ శుక్రవారం కూడా చప్పగానే..

Sun 19th Apr 2026 10:36 AM
papam prathap  ఈ శుక్రవారం కూడా చప్పగానే..
This week releases ఈ శుక్రవారం కూడా చప్పగానే..
Advertisement
Ads by CJ

సమ్మర్ లో టాలీవుడ్ హీట్ కనిపిస్తుంది, పెద్ద చిత్రాల హడావుడి ఉంటుంది అనుకుంటే భారీ బడ్జెట్ మూవీస్ అన్ని సమ్మర్ ని వదిలేసాయి. ఈ హీట్ సమ్మర్లో కూల్ సినిమాలతో ఎంజాయ్ చేద్దామనుకున్న ప్రేక్షకులకు ప్రతి వారము నిరాశే కనిపిస్తుంది. క్రేజీ సినిమాలేవీ బాక్సాఫీసు ని షేక్ చెయ్యడానికి సిద్ధపడడం లేదు.

ఏప్రిల్ 30 న రావాల్సిన పెద్ది కూడా వేసవి సెలవులను వదిలేసి జూన్ కి వెళ్ళిపోయింది. సంక్రాంతి తర్వాత ధురంధర్ 2 దూకుడు తప్ప మళ్లీ అంత స్పీడున్న సినిమాలేవీ రాలేదు. గత రెండు వారాలుగా విడుదలైన బైకర్, రాకాస, డెకాయిట్ చిత్రాలు జస్ట్ యావరేజ్ కేటగిరీలోనే ఆగిపోయాయి.

నిన్న శుక్రవారం విడుదలైన చిన్న సినిమాలు ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. తిరువీర్ పాపం ప్రతాప్, కిరణ్ అబ్బవరం తిమ్మరాజు పల్లి టివి, నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తోవినో థామస్ పల్లిచట్టంబి.. ఈ చిత్రాల్లో కేవలం తిమ్మరాజు పల్లి టీవీ నే కాస్తో కూస్తో బెటర్ గా ఉన్నా ఆ చిత్రానికి మినిమమ్ ఓపెనింగ్స్ లేవు.

అంతే కాదు ఇవన్నీఓటీటీ సినిమాలను ప్రేక్షకులు మెంటల్ గా ఫిక్స్ అవుతూ ఉండడంతో.. చిన్న చిత్రాలకు థియేటర్స్ లో అసలు ఓపెనింగ్స్ పడడం లేదు. సో ఈ శుక్రవారం కూడా చెప్పగానే వెళ్ళిపోయింది. 

This week releases:

This week releases list

Tags:   PAPAM PRATHAP
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ