Advertisementt

స్వయంభు ముందున్న అతి పెద్ద ఓటీటీ సమస్య

Sun 19th Apr 2026 11:10 AM
swayambhu  స్వయంభు ముందున్న అతి పెద్ద ఓటీటీ సమస్య
Swayambhu comes with creative OTT deal స్వయంభు ముందున్న అతి పెద్ద ఓటీటీ సమస్య
Advertisement
Ads by CJ

నిఖిల్ సిద్దార్థ్ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం స్వయంభు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇవ్వకుండా మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. నిఖిల్ సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నా సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ అంత నాన్చాడానికి అసలు కారణం ఓటీటీ డీల్ సెట్ కాకపోవడమే అంటున్నారు.

అంటే స్వయంభు మేకర్స్ ఓటీటీ సంస్థలతో బేరసారాలు ఆడుతున్నారని, అందులో నెట్ ఫ్లిక్స్ సంస్థ స్వయంభు ఓటీటీ రైట్స్ తీసుకునేందుకు ముందుకొచ్చినా స్వయంభు మేకర్స్ ముందు ఓ విచిత్రమైన డీల్ ఉంచినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈమధ్యన థియేట్రికల్ రిలీజ్ ల కన్నా ముందే ఓటీటీ డీల్ చేసుకుంటే థియేటర్స్ లో సినిమా ప్లాప్ అయితే ఓటీటీ లు భారీగా నష్టపోతున్నాయి.

ఒకప్పుడు క్రేజీ డీల్స్ తో నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ గా మారిన ఓటీటీలు ఇప్పుడు నిర్మాతలకు షాకిస్తున్నాయి. అందులో భాగంగానే స్వయంభు నిర్మాతల ముందు నెట్ ఫ్లిక్స్ పెట్టిన డీల్ నిజంగానే షాకిచ్చింది. స్వయంభు చిత్రం థియేటర్లలో సాధించే నెట్ కలెక్షన్స్‌లో సగం మొత్తాన్ని డిజిటల్ రైట్స్ కింద నెట్‌ఫ్లిక్స్ ముందు చెల్లిస్తుంది. 

ఫర్ ఎగ్జామ్పుల్ స్వయంభు కనుక రూ.200 కోట్ల రూపాయల నెట్ వసూలు చేస్తే అందులో రూ.100 కోట్ల రూపాయలు ఓటీటీ డీల్ నుంచి దక్కుతాయన్న మాట. అలా సినిమా థియేటర్స్ లో ఎంత వసూలు చేస్తే అందులో సగం నెట్ ఫ్లిక్స్ చెల్లింది. మరి ఈ డీల్ విషయంలోనే  స్వయంభు నిర్మాతలు వెనుకాముందు ఆడుతున్నారట. అందుకే రిలీజ్ డేట్ కూడా లేట్ అవుతుంది అని తెలుస్తుంది. 

Swayambhu comes with creative OTT deal:

Swayambhu OTT deal becomes talking point

Tags:   SWAYAMBHU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ