Advertisementt

పెద్ది దానికే ఫిక్స్ అవుతుంది

Sun 19th Apr 2026 09:58 AM
peddi  పెద్ది దానికే ఫిక్స్ అవుతుంది
Peddi Movie Update పెద్ది దానికే ఫిక్స్ అవుతుంది
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ఏప్రిల్ 30 నుంచి అధికారికంగా పోస్ట్ పోన్ అయ్యింది. కొత్త రిలీజ్ డేట్ ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ ని పెద్ది మేకర్స్ కన్ఫ్యూజన్ లో పెట్టారు. దానితో పెద్ది ఇప్పట్లో రాదనే ఊహాగానాలు మిన్నంటాయి. జూన్ 4 కానీ, లేదంటే జూన్ 25 కానీ పెద్ది రిలీజ్ ఉంటుంది అనే ప్రచారం జరిగింది.

కానీ పెద్ది కోసం ఫ్యాన్స్ ని ఎక్కువగా వెయిట్ చేయించడం ఇష్టం లేని దర్శకుడు బుచ్చి బాబు పెద్ది ని ఎట్టి పరిస్థితిల్లో జూన్ 4 కి తేవాలని అనుకుంటున్నారట. అదే రోజు అంటే జూన్ 4 నే యశ్ టాక్సిక్ రిలీజ్ అవుతుంది. అయినప్పటికి పెద్ది, టాక్సిక్ కి పోటీ ఇవ్వాలని అనుకుంటుందట. 

ప్రస్తుతం పెద్ది పై ఉన్న హైప్ మామూలుది కాదు. సౌత్ నుంచి నార్త్ వరకు పెద్ది కోసం ప్రేక్షకులు వెయిట్ చేసేలా కంటెంట్ వదిలారు మేకర్స్. కానీ టాక్సిక్ అలా కాదు.. టాక్సిక్ టీజర్ కే డివైడ్ టాక్ వచ్చింది. మరోపక్క టాక్సిక్ ప్రమోషన్స్ కన్నా ఎక్కువగా యశ్ రామాయణ విశేషాలు పంచుకోవడం చూసి టాక్సిక్ వాయిదా పడినా పడొచ్చని అంటున్నారు.

ఒకవేళ జూన్ 4 నే చరణ్ vs యశ్ అయినా పెద్దిదే పై చెయ్యి అవుతుంది అనేది ట్రేడ్ వర్గాల అంచనా. అందుకే పెద్ది జూన్ 4 కే ఫిక్స్ అవుతుంది అని తెలుస్తుంది.

Peddi Movie Update:

Peddi Movie

Tags:   PEDDI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ