కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ చిత్రం మార్చ్ 19 నుంచి వాయిదా పడి జూన్ 4 కి కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూన్ 4 న రిలీజ్ ఉండడంతో యశ్ ఇంకా టాక్సిక్ మేకర్స్ సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా యశ్ ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్ టాప్ సీక్రెట్ రివీల్ చేశారు.
టాక్సిక్ అంటే కేవలం గ్యాంగ్ స్టర్ కథ మాత్రమే కాదు, అలాగే టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ టైటిల్ వెనుక ఇంట్రెస్టింగ్ కారణముందట. తండ్రి-కొడుకు ల ఎమోషనల్ రివేంజ్ డ్రామా, రామాయణం వంటి పౌరాణిక గాథలకు ఈ చిత్రం పూర్తిగా డిఫ్రెంట్ స్టయిల్ లో ఉంటుంది.. టాక్సిక్ ప్రపంచం చాలా కరకుగా, వైల్డ్‌గా ఉంటుంది.. అంటూ యశ్ టాక్సిక్ లోని టాప్ సీక్రెట్ రివీల్ చేసారు.
యశ్ రాయ అనే పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తుండగా.. గీతూ మోహన్ దాస్ గోవా నేపథ్యంలో ఈ కథను 1940 నుండి 1970 వరకు అంటే సుమారు మూడు దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక మాఫియా సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, చివరికి అది ఏమైంది అనే అంశాలను ఇందులో అద్భుతంగా ఆవిష్కరించినట్లుగా తెలుస్తుంది.
సినిమాకాన్ లో ప్రదర్శించిన టాక్సిక్ చిత్ర 9 నిమిషాల స్పెషల్ ప్రివ్యూ చూసి హాలీవుడ్ ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోయారట.




తోవినో విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ 
Loading..