తోవినో థామస్ మెయిన్ లీడ్ లో కేరళ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిన పళ్ళి చట్టంబి రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ ప్రమోట్ చేస్తూ.. ఆ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం నుంచి తప్పుకున్నాను, కారణం ఏళ్ళ తరబడి ఒకే సినిమా కోసం డేట్స్ కేటాయించడం నాకు కుదరదు అంటూ తోవినో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసాడు.
తోవినో థామస్ ఎన్టీఆర్ విలన్ అన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ తోవినో తానే ఈ ప్రాజెక్ట్ నుంచి కావాలని తప్పుకున్నాను అన్నప్పుడు ఫీలైపోయారు. అయితే తాజాగా పళ్ళి చట్టంబి తెలుగులో కూడా విడుదలవడం, ఆ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడిపోతున్నారు.
ఎంతగా సినిమాని ప్రమోట్ చేసినా ఆ సినిమా నేపథ్యం మలయాళం కావడంతో అది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. తెలుగు సినిమా తిమ్మరాజుపల్లి టివి ప్రేక్షకులను కాస్త ఇంప్రెస్స్ చెయ్యడంతో పళ్ళి చట్టంబి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోవినో థామస్ పై పగ తీరింది అంటూ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.




ముంబైలో వంశీ-సల్మాన్ కాంబో పూజ 
Loading..