పెద్ది ని చూసి ఫీల్ అవ్వని ఎన్టీఆర్ ఫ్యాన్స్

NTR fans on Peddi movie

 

ఉప్పెన తర్వాత వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఓకే చేయించుకుని మైత్రి వారితో అఫిషియల్ అనౌన్సమెంట్ ఇప్పించి అందరిని ఆశ్చర్యపరిచిన బుచ్చి బాబు.. ఎన్టీఆర్ కి పెద్ది చిత్ర కథ చేప్పి ఓకే చేయించుకున్నాడనే టాక్ నడిచింది. బుచ్చి బాబు పెద్ది స్క్రిప్ట్ పై సీరియస్ గా కూర్చున్నాడు. ఈలోపులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కథకు కనెక్ట్ అవడంతో పెద్ది ఆగిపోయింది.

సుకుమార్ సాయంతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లి పెద్ద కథ చెప్పి ఒప్పించాడు బుచ్చిబాబు. తాజాగా రామ్ చరణ్-బుచ్చి బాబు ల పెద్ది విడుదలైంది. ఆ చిత్రం కి వస్తున టాక్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమాత్రం ఫీల్ అవ్వడం లేదు. పెద్ది ప్రమోషనల్ కంటెంట్ చూసి ఎన్టీఆర్ కి హిట్ మిస్ అవుతుంది అని బాధపడిన ఫ్యాన్స్ ఇప్పుడు పెద్ది సినిమా చూసి అస్సలు బాధపడడం లేదు. కారణం పెద్ది బావుంది అని మెగా ఫ్యాన్స్ తప్ప మరెవ్వరూ చెప్పడం లేదు.

కేవలం రామ్ చరణ్ యాక్టింగ్, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ని తప్ప పెద్ది లో మరే విషయాన్ని ఆడియన్స్ పొగడడం లేదు. లాజిక్ లేని సినిమా, బుచ్చి బాబు డైరెక్షన్ ఏమిట్రా బాబు, ఆ జాన్వీ కపూర్ ని ఎందుకు తీసుకుంన్నారు... తలా తోక లేని సినిమా చేసారు అంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోలోపల హ్యాపీ అవుతున్నారు.

ఈ చిత్రం ఎన్టీఆర్ చేసుంటే ఆయన ఖాతాలో ప్లాప్ పడి ఉండేది. పెద్ది ని వదులుకుని ఎన్టీఆర్ మంచి పని చేసారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హుషారుగా ఫీల్ అవుతున్నారు.

NTR fans