వారణాసిలో 30 నిమిషాల విజువల్ వండర్!
Vijayendra Prasad startling revelation about Varanasiఎస్.ఎస్. రాజమౌళి- సూపర్‌స్టార్ మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్నన మోస్ట్ అవేటెడ్ అడ్వెంచర్ ఎపిక్ `వారణాసి` చిత్రంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. త్రేతాయుగం నుండి కలియుగం వరకు విభిన్న కాలమానాలు, ఆఫ్రికా అడవుల నుండి అంటార్కిటికా మంచు ఖండాల వరకు సాగే సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రాజమౌళి గ్లోబల్ విజువల్ వండర్‌గా మలుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విశేషాలు సంచలనంగా మారాయి. చిత్రంలో సుమారు 30 నిమిషాల పాటు సాగే ఒక అద్భుతమైన ఎపిసోడ్ ఉంటుందని, అది మరేదో కాదూ.. సాక్షాత్తూ శ్రీరాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే మహా సంగ్రామమేనని స్పష్టం చేశారు. ఇందులో మహేష్ భగవాన్ శ్రీరాముడిగా రౌద్రరూపంలో కనిపించనుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకూమారన్ కుంభ పాత్రలో పవర్‌ఫుల్ విలన్‌గా ఢీకొట్టబోతున్నారు.
ఈ పౌరాణిక యుద్ధ సన్నివేశాన్ని అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించడానికి రాజమౌళి ఏకంగా 60 రోజుల పాటు శ్రమించారంటే దీని నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
మహేష్ ను శ్రీరాముడి గెటప్‌లో చూసిన మొదటి రోజే తనకు ఒళ్లు గగుర్పొడిచిందని, ఆ లుక్‌ను ఎవరికీ కనిపించకుండా తన ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నానని గతంలో రాజమౌళి స్వయంగా వెల్లడించారు. కథలో వచ్చే సుదీర్ఘ పౌరాణిక ఘట్టం ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇస్తుందని.. ప్రతి ఒక్క సబ్-ఎపిసోడ్ ప్రత్యేక సినిమా తరహాలో సవాలుతో కూడుకున్నట్లుగా నిర్మించామని చిత్ర బృందం పేర్కొంది.
















































