జాన్వీని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారు
Janhvi Kapoor role in Peddi
అందం ఉంది, నటనలో ఎంతోకొంత మెళుకువలు నేర్చుకుంది. కానీ ఈ పాప ని మాత్రం ప్రతి ఒక్క దర్శకుడు గ్లామర్ డాల్ లానే ట్రీట్ చెయ్యడం చూసి ప్రేక్షకులే పెదవి విరుస్తున్నారు. బాలీవుడ్ లో కాస్త నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే.. సౌత్ లో ఆమె చేసిన దేవర, పెద్ది రెండు చిత్రాలు గ్లామర్ డాల్ పాత్రలే.
దేవర ఓ రెండు పాటలకి పరిమితమైతే, పెద్ది లో నన్ను ఇంకొంచెం ఎక్కువ చూస్తారు అంటూ ఊరించిన జాన్వీ కపూర్.. పెద్ది సినిమాలో మాత్రం డిజప్పాయింట్ చేసింది. జాన్వీ కపూర్ ట్రాక్ స్పీడుగా వెళుతున్న కథకు స్పీడు బ్రేకులు పడ్డట్టు ఉంది. ఆమె కేవలం గ్లామర్ షో కి తప్ప మరెందుకు పనికి రాలేదు.
జాన్వీ కపూర్ ని చూస్తే చిరాకు పుట్టింది. అసలు జాన్వీ కపూర్ సౌత్ లో ఎలాంటి సినిమా తో ఎంట్రీ ఇస్తుందో అనుకుంటే దేవర, పెద్ది లాంటి పెద్ద సినిమాల్తో ఎంట్రీ ఇచ్చినా ఆమె కేరెక్టర్ మాత్రం తేలిపోయింది. మరి ఇదేనా ఆమె సౌత్ నుంచి కోరుకుంది. సినిమాలు హిట్ అయినా జాన్వీ కపూర్ కి పేరు రావడం లేదు సరికదా విమర్శలొస్తున్నాయి.
అసలు దర్శకులు జాన్వీ కపూర్ ని అలా గ్లామర్ డాల్ లా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ అయినా ఈ విషయంలో మారితే ఆమె కెరీర్ బావుంటుంది లేదంటే..







































