ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kareena Kapoor Khan enjoys a bowl full of aamras after meal

మామిడి పండ్ల సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్న కరీనా!

Kareena Kapoor Khan enjoys a bowl full of aamras after meal

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, పటౌడీ బేగం కరీనా కపూర్ ఖాన్ తన నటనతోనే కాదు. సోషల్ మీడియా పోస్టులతోనూ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే జీరో సైజ్ బ్యూటీ, సీజన్ మారినప్పుడు మాత్రం తనదైన స్టైల్‌లో ఫుడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి వెనకాడరు. ప్రస్తుతం ఎండకాలం కావడంతో అందరిలాగే కరీనా కూడా నోరూరించే మామిడి పండ్ల రుచులను ఆస్వాదిస్తున్నారు. తాజాగా  భోజనం ముగిసిన తర్వాత ఒక గిన్నె నిండా రుచికరమైన `ఆమ్రస్` (మామిడి పండ్ల గుజ్జుతో చేసే స్వీట్) తింటూ కనిపించి అభిమానుల్లో నోరూరించారు.

ఈ ప్రత్యేకమైన ఫుడ్ మూమెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టేబుల్‌పై ఉన్న ఆమ్రస్ గిన్నెను ఫోటో తీసి, దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జోడించారు. `ఖానా ఖానే కే బాద్ ఆమ్రస్ తో బంత హై నా` (భోజనం చేసిన తర్వాత ఆమ్రస్ తినడం ఖాయం కదా) అంటూ రాసుకొచ్చారు. సాధారణంగా కఠినమైన డైట్ ఫాలో అయ్యే సెలబ్రిటీలు సైతం ఇండియన్ ట్రెడిషనల్ మ్యాంగో డెజర్ట్స్‌ను అస్సలు వదులుకోరని కరీనా పోస్ట్ మరోసారి నిరూపించింది.

లండన్‌లో సుదీర్ఘమైన వెకేషన్ ముగించుకుని ముంబై తిరిగొచ్చిన బేబో ఇలా సమ్మర్ స్పెషల్ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ రీఛార్జ్ అవుతున్నారు. త్వరలోనే ఆమె మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో కూడా క‌రీనా న‌టించాల‌ని అభిమానులు కోరుతున్నా? అమ్మ‌డు మాత్రం ఎందుక‌నో తెలుగు సినిమాల‌కు దూరంగా ఉంటోంది. మ‌రి ఈ కోరిక ఎప్పుడు నెర‌వేరేనో.

Kareena Kapoor shares her love for aamras after dinner