Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> RanaBaali Filming At The Grand Canyon Of India

గండికోటలో `రణబాలి` విన్యాసాలు!

RanaBaali Filming At The Grand Canyon Of India

టాలీవుడ్ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ- రష్మికా మందన్న జంట‌గా తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్రం `రణబాలి`. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్స‌`చిత్రాల తర్వాత  ఇద్ద‌రు జంటగా నటిస్తుండటం.. నిజజీవితంలో వివాహ బంధంతో ఒకటైన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో  ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట కోట పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

బ్రిటిష్ కాలం నాటి చారిత్రక అంశాల నేపథ్యంలో 18వ శతాబ్దపు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాయలసీమ కథకు తగినట్లుగానే గండికోట ముఖద్వారం, చారిత్రక ధాన్యగారం వద్ద చిత్ర యూనిట్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసింది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ వింటేజ్ లుక్‌లో గుర్రపు స్వారీ చేస్తూ పాల్గొంటున్న సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లోనే చిత్రీకరిస్తున్నారు.  కోట పరిసర ప్రాంతాలలో దాదాపు ఆరు రోజుల పాటు సాగే ఈ కీలక షెడ్యూల్‌లో జ‌ర‌గ‌నుంది. విజువల్స్ పరంగా సినిమాకు ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రధానమైన ఎపిసోడ్స్‌ను పూర్తి చేయడానికి రాహుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

రియల్ అండ్ రీల్ కపుల్ విజయ్- రష్మికాలను చూడటానికి స్థానిక అభిమానులు, పర్యాటకులు షూటింగ్ స్పాట్‌కు భారీగా తరలివస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని లొకేషన్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నీరవ్ షా అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని హంగులతో ముస్తాబవుతున్న ఈ లవ్ అండ్ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
 

RanaBaali Shoot Moves Fast At Gandikota Fort With Vijay Deverakonda