ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Comedy Satires on Jana Nayagan Release

జన నాయగన్ పై కామెడీ సెటైర్స్

Comedy Satires on Jana Nayagan Release

 

కోలీవుడ్ స్టార్ హీరో నుంచి సీఎం స్థాయికి ఎదిగిన విజయ్ గురించి చర్చ మీడియాలో ఇంకా ఆపలేదు. విజయ్ రాజకీయ విజయం చాలా కాలం గుర్తుండిపోతుంది. అయితే విజయ్ సీఎం అవ్వకముందు ఆయన నటించిన చివరి సినిమా విడుదల కావాల్సి ఉంది. జన నాయగన్ విడుదలకు ఇంకా ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది.

నాయకుడు ఎప్పుడొస్తాడా అని విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూడని రోజు లేదు. విజయ్ సీఎం రావడంతోనే జన నాయగన్ విడుదలై పోతుంది అనుకున్నారు. అసలు ఈ జూన్ 19 న విడుదలయ్యే ఛాన్స్ ఉంది అనే ప్రచారం కూడా జరిగింది. కానీ జన నాయగన్  విడుదల జూన్ 19 న లేనట్లే అని తెలుస్తుంది.

దానితో విజయ్ జన నాయగన్ పై సెటైర్స్ మొదలయ్యాయి. సినిమా రిలీజ్ అంటే సీఎం అయినంత ఈజీ కాదు, విజయ్ సీఎం అయినా తన సినిమాని విడుదల చేసుకోలేకపోయాడు అంటూ కామెడీగా మాట్లాడుతుంటే.. మరోపక్క జన నాయగన్ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి రిఫండ్ చేస్తున్నారనే టాక్ హాట్ టాపిక్ గా మారింది.

Vijay Jana Nayagan likely to miss June 19 release