Advertisementt

మోక్షు కోసం వెళితే బాలయ్య తగిలారు

Thu 16th Apr 2026 02:49 PM
mokshagna  మోక్షు కోసం వెళితే బాలయ్య తగిలారు
Nandamuri Mokshagna మోక్షు కోసం వెళితే బాలయ్య తగిలారు
Advertisement
Ads by CJ

మోక్షజ్ఞ తెరంగేట్రం పై ఎడ తెగని ఉత్కంఠ నడుస్తుంది. నందమూరి నటసింహ వారసుడిని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ మోక్షజ్ఞ మాత్రం ఆ సమయం ఇంకా రాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. బాలయ్య కూడా కొడుకు కోసం ఆలోచిస్తున్నారో, లేదో తెలియదు కానీ ఆయన వరస సినిమాలు లైన్ లో పెట్టేసుకుంటున్నారు.

రీసెంట్ గా మోక్షజ్ఞ మోసం వెళ్లిన ఓ దర్శకుడు చెప్పిన కథను మోక్షజ్ఞ రిజక్ట్ చెయ్యగా.. మరో కథ తో అదే దర్శకుడు బాలయ్య ను మెప్పించారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో నడుస్తుంది. అతనే బింబిసార దర్శకుడు వసిష్ఠ. బింబిసార తర్వాత మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారు. విశ్వంభర విడుదలయ్యాక వసిష్ఠకు రవితేజ తో ఓ మూవీ కమిట్మెంట్ ఉంది.

ఈమద్యలో వసిష్ఠ నందమూరి వారసుడు మోక్షజ్ఞ ని కలిసి కథ వినిపించగా ఆ కథ మోక్షు కి నచ్చలేదట. మరో కథతో బాలయ్య ని కలిస్తే అది ఆయన ఓకే చేసారని తెలుస్తుంది. సో కొడుకు కోసం వెళితే తండ్రి ఓకే చేశారన్నమాట. మరి వసిష్ఠ-బాలయ్య మూవీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.        

Nandamuri Mokshagna:

Nandamuri Balakrishna - Nandamuri Mokshagna

Tags:   MOKSHAGNA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ