Advertisementt

యావరేజ్ అంటే షెడ్డుకే

Thu 16th Apr 2026 01:12 PM
cinema  యావరేజ్ అంటే షెడ్డుకే
Movies యావరేజ్ అంటే షెడ్డుకే
Advertisement
Ads by CJ

ఈమధ్య కాలంలో ఆడియన్స్ కానివ్వండి, క్రిటిక్స్ కానివ్వండి ఏదైనా సినిమాని యావరేజ్ అన్నారు అనుకోండి ఇక అది థియేటర్స్ లో సర్వైవ్ అవడం అనేది జరగడం లేదు. ప్రేక్షకులు బావుంది అని, క్రిటిక్స్ యావరేజ్ అన్న మౌత్ టాక్ తో ఎంతోకొంత సేవ్ అయినా.. ఆడియన్స్ నోట కూడా మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తే ఆ సినిమా ఇక థియేటర్స్ ఆడడం అలా ఉంచి షెడ్డుకే అన్నట్టుగా తయారైంది ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితి. 

ప్రేక్షకులు కూడా సినిమా సూపర్ హిట్ అయినా, లేదంటే ఎక్స్ట్రార్డనరీగా ఉంటేనే థియేటర్స్ కి కదులుతున్నారు. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడడం లేదు.. బావుంది అది కూడా చాలా బావుంది అంటేనే థియేటర్స్ కి వెళుతున్నారు. ఈమధ్య కాలంలో యావరేజ్ అన్న సినిమాలన్ని డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి.

యావరేజ్ సినిమాని కూడా థియేటర్స్ లో చూడాలా, మూడు వారాలు ఆగితే ఏదో ఒక ఓటీటీ లో చూడొచ్చని ఆడియన్స్ ఫిక్స్ అవడమే అందుకు కారణం. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అన్నొచ్చాయి, ఇన్నొచ్చాయి, సక్సెస్ మీట్స్,సెలెబ్రేషన్స్, ఇంటర్వూస్ అంటున్నా సినిమాని పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు అంటే యావరేజ్ సినిమాల పరిస్థితి ఏమిటో అర్ధమైపోతుంది. 

Movies:

Cinema

Tags:   CINEMA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ