Advertisementt

దేవర 2 ఇప్పుడప్పుడే లేనట్లే

Thu 16th Apr 2026 09:44 AM
devara 2  దేవర 2 ఇప్పుడప్పుడే లేనట్లే
Devara 2 Update దేవర 2 ఇప్పుడప్పుడే లేనట్లే
Advertisement
Ads by CJ

అనుకున్న సమయానికి సినిమాలు మొదలు కావట్లేదు, అనుకున్న సమయానికి సినిమా షూటింగ్స్ పూర్తి కావు, ఇచ్చిన డేట్ కి సినిమా లు రిలీజ్ కావు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కొరటాలకు ఎదురు చూపులు తప్పేలా  లేవు. కారణం దేవర 2 ఇప్పుడప్పుడే మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. 

ఎందుకంటే #NTRNeel మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ రావడం లేదు. ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) ఇప్పటికి ఫస్ట్ లుక్ లేదు, టైటిల్ లేదు. మే 20 ఎన్టీఆర్ బర్త్ డే వరకు వెయిట్ చెయ్యమని మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు. మరి డ్రాగన్ షూటింగ్ కంప్లీట్ అవకుండా ఎన్టీఆర్ కొరటాల దేవర 2 సెట్ లోకి వెళ్ళలేరు.

దేవర 2 మే లో మొదలవుతుంది అన్నారు. తర్వాత సెప్టెంబర్ అన్నారు, కానీ ఇప్పుడు దేవర 2 ఎప్పడు మొదలవుతుందో ఎవరికీ క్లారిటీ లేని పరిస్థితి. కొరటాల మాత్రం దేవర 2 పైనే కూర్చున్నారు తప్ప మరో ప్రాజెక్ట్ ని అయన లైన్ లోకి తీసుకోవడం లేదు. మరి ఎన్టీఆర్ కోసం కొరటాల ఎదురు చూపులు ఎన్నాళ్ళో, ఏమిటో..!

Devara 2 Update :

NTR Devara 2 Update 

Tags:   DEVARA 2
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ