అందం ఉంది, గ్లామర్ ఉంది, కత్తిలాంటి లుక్స్, డాన్స్ అని ఉన్నాయి. కానీ పాపకు అదృష్టమే లేదు. ఏ హీరో కి దక్కని అదృష్టం శ్రీలీల కు వచ్చింది. వరస కమిట్మెంట్స్, వరసగా యంగ్ హీరోల అవకాశాలు. కానీ స్క్రిప్ట్ ల ఎంపిక లో శ్రీలీల డొల్లతనమో, లేదంటే చిన్న తనమో ప్రతి విషయంలో తేటతెల్లమైంది.
ఆమె చాటు బిడ్డలా శ్రీలీల కథ ల ఎంపికలో తడబాటు ఆమె కెరీర్ ని డోలాయమానంలో పడేసింది. తెలుగు లో శ్రీలీల కు ఇకపై ఛాన్స్ లు వస్తాయో, రాదో తెలియదు. కారణం రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ కూడా శ్రీలీల కు షాకిచ్చింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం బ్రైట్ గా బ్యూటిఫుల్ గా కనిపించే శ్రీలీల తాజాగా వదిలిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
రెడ్ మిర్రర్ శారీ లో దానికి మ్యాచింగ్ మిర్రర్ బ్లౌస్, మెడలో హెవీ నెక్ లెస్ తో శ్రీలీల స్మైలీ ఫేస్, అలాగే ఇన్నోసెంట్ గా కనిపించిన లుక్ మాత్రం నిజంగా అద్దిరిపోయాయి.




హీటెక్కించే సమ్మర్ లో సమ్మె సెగ!
Loading..